కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసరాల ధరలు పెంచాయని.. వ్యాట్ రూపంలో రాష్ట్రం దోచుకుంటున్నాయి.. టీపీసీసీ రేవంత్ రెడ్డి..

మాజీ మంత్రి భీమ్ రావ్ కూతురు, అసిఫాబాద్ ఆదివాసీ నేత ముర్సుకొల సరస్వతి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆమెకు కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి తదితరులు పాల్గొన్నారు…రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసిఆర్ కుటుంబ పాలన తెలంగాణకు ప్రమాదకరంగా మారిందని అన్నారు. దుష్ట చతుష్టయం పాలనను అంతం చేయడానికి నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని పేర్కొన్నారు. రాహుల్, సోనియా గాంధీ నాయకత్వం పై విశ్వాసం ప్రకటిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఇచ్చింది కేసిఆర్ కుటుంబం కోసం కాదని అన్నారు. రాష్ట్ర ఏర్పాటును తప్పుగా మాట్లాడిన బీజేపీ కోసం రాష్ట్రం ఇవ్వలేదని.. పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ది కోసం కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసరాల ధరలు పెంచాయని.. వ్యాట్ రూపంలో రాష్ట్రం దోచుకుంటుందని విమ‌ర్శించారు..

వారం రోజులుగా ఢిల్లీ లో కేసిఆర్ ఏం చేస్తున్నారని ప్ర‌శ్నించారు. ప్రజలు వరదల్లో నష్ట పోతే కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని అన్నారు. తండ్రి ఢిల్లీ లో, ఆయన కొడుకు కాలు జారి హోం థియేటర్ ఎదుట‌ కూర్చున్నార‌ని అన్నారు…