ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై పీఎం మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, సీబీఐ డైరక్టర్లకు లేఖ…పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి…

టీఆర్ఎస్ సర్కార్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినా…. రారైస్ కొంటామని కేంద్రం స్పష్టంచేసినా.. ఈ అంశాన్ని ఇంతటితో వదిలేది లేదంటున్న కాంగ్రెస్ పార్టీ PCC రేవంత్ రెడ్డి… ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ముందునుంచీ చెబుతున్న అంటు చాలాసార్లు ప్రస్తావించాను అంటున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఏకంగా సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు…ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై పీఎం మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, సీబీఐ డైరక్టర్లకు లేఖ రాశారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధాన్యంసేకరణలో లేవనెత్తిన సందేహాలను ఈ లేఖలో ప్రస్తావించారు. తెలంగాణలో రైస్ మిల్లర్లు ఎఫ్సీఐ నుంచి ధాన్యం సేకరించి బియ్యం ఇవ్వలేదన్నారు. ఈ విషయం ప్రభుత్వానికి తెలిసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన బియ్యాన్ని మిల్లర్లు నల్లబజారుకు తరలించారా.. లేక విదేశాలకు అమ్ముకున్నారా అని రేవంత్ ప్రశ్నించారు. …దీంతోపాటు వరేస్తే ఉరే అంటూ గతంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రబీ సమయంలో సీఎం కేసీఆర్ చేసిన గందరగోళం, అనిశ్చితి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. దాదాపు నలభైశాతం మంది రైతులు దోపిడీకి గురయ్యారన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టమైన వైఖరి లేకపోవడం వల్ల రైతులు మిల్లర్లు, దళారులకు ధాన్యం అమ్ముకున్నారన్నారు. దీనివల్ల రైతులకు దాదాపు మూడు నుంచి నాలుగువేల కోట్ల రూపాయల నష్టం జరిగిందన్నారు. రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం భర్తీచేయాలన్నారు.