తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశయ్యారు. పలు అంశాలపై ఇద్దరు చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే సమావేశం తర్వాత బయటకొచ్చిన కోమిటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నాని వెల్లడించారు. సమావేశానికి రావాలని మాణిక్‌రావు ఠాక్రే రమ్మన్నారు.. అందుకే వచ్చానని తెలిపారు. గాంధీభవన్ మెట్లు ఎక్కనని తాను అనలేదని అన్నారు. తనలాంటి సీనియర్లు పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించానని అన్నారు. జనవరి 26 నుంచి జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటాను. అధికారంలోకి ఎలా రావాలి? అనే అంశంపై చర్చిస్తాము. అవసరమైతే తెలంగాణవ్యాప్తంగా పాదయాత్ర చేస్తాను అని అన్నారు. అనంతరం.. గాంధీభవనల్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. దీంతో, వారి మధ్య చర్చపై ఆసక్తి నెలకొంది..గాంధీభవన్‌లో అడుగు పెట్టనని శపథం చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. తన ఒట్టును గట్టు మీద పెట్టారు. గాంధీభవన్‌కు వచ్చారాయన. ఎప్పుడూ గాంధీభవన్‌కు వచ్చే సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు.. ఈసారి వచ్చి అలిగి వెళ్లిపోయారు. మహేష్‌గౌడ్‌తో గొడవపడి ఇక్కడ అందరూ నాయకులే అంటూ రుసరుసలాడుతూ వెళ్లిపోయారాయన. టి.కాంగ్రెస్ ఇంచార్జ్‌గా బాధ్యతలు స్వీకరించాక రెండోసారి హైదరాబాద్ వచ్చిన మాణిక్‌రావు థాక్రే.. వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్య నాయకుల రాకతో గాంధీభవన్ మరోసారి కళకళలాడుతోంది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.