తిరగబడదాం..తరిమికొడదాం..’ నినాదంతో బిఆర్ఎస్ వైఫల్యాలను ప్రజాలోకి తీసుకువెళ్తాం.! : టీపీసీసీ రేవంత్ రెడ్డి..
‘
*హైదరాబాద్.’తిరగబడదాం.. తరిమికొడదాం’ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు..భారాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం రూపొందించినట్టు తెలిపారు. బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ.. నెల రోజుల పాటు గ్రామ గ్రామాన భారాస వైఫల్యాలపై పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా భారాస ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ ఛార్జ్‌షీట్ విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. 12వేల గ్రామాల్లో, 3వేల డివిజన్లలో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు వెళ్లి 75లక్షల కుటుంబాలను కాంగ్రెస్ శ్రేణులు కలుస్తారని వెల్లడించారు..