సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకునే అవకాశం..!!!?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన ఆధిక్యం రావడంతో. 64 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ మరికాసేపట్లో సీఎల్పీ నేతను ఎన్నుకోనుంది…
హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో సమావేశం ఏర్పాటు చేయగా.. గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థులు ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకుంటున్నారు. ఏఐసీసీ పరిశీలకుల ఆధ్వర్యంలో సీఎల్పీ నేత ఎంపిక ప్రక్రియ సాగనుండగా.. ఎవర్ని ఎన్నుకుంటారనేది ఉత్కంఠగా మారింది..

రేపు ఉదయం 9:30 గంటలకు సీఎల్పీ సమావేశం. సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకునే అవకాశం…!! అయితే ఇదే విషయంపై కాంగ్రెస్ పార్టీ కూడా చాలా గోప్యంగా వ్యవహరిస్తూ పార్టీ నాయకుల్లో భిన్నభిప్రాయాలు వ్యక్తం కాకుండా చేస్తున్నారు..