పేదల నడ్డి విరిచే ప్రభుత్వాలపై పోరాటం తప్పదు.. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి..

పెట్రోల్, డీజిల్, గ్యాస్, ధరలు తగ్గే వరకు విద్యుత్ చార్జీలు తగ్గే వరకు, రైతులు పండించిన పంటలు చివరి గింజ కొనే వరకు కాంగ్రెస్ పోరాటాలు సాగుతాయన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ కార్యవర్గం, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు….డీసీసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ల వద్ద ధర్నాలు విజయవంతంగా చేయాలి. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ భరోసా కల్పించాలి. కాంగ్రెస్ పార్టీ తమ పక్షాన పోరాటం చేస్తుందని ప్రజలు విశ్వసించాలి. ఐదు అంశాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తగ్గి చార్జీలు తగ్గించే వరకు పోరాటాలు జరగాలి.. రైతులకు భరోసా వచ్చే వరకు ప్రతి వరి గింజ కొనేవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల వైకరిపైన ఉద్యమాలు చేయాలని దిశానిర్దేశం చేశారు…