ప్రత్యెక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది సోనియా గాంధీ చొరవతోనే.. టీపీసిసి రేవంత్ రెడ్డి..

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ చొరవతో కోట్లాది మంది ప్రజల అరవై ఏళ్ల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఎనిమిదేళ్ల క్రితం ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.వందల మంది త్యాగాల సాక్షిగా రాష్ట్రాన్ని సాధించుకున్నాం. స్వపరిపాలన సుపరిపాలన అవుతుందని ఆశించిన తెలంగాణకు గులాబీ చీడ పట్టుకుంది. ఎనిమిదేళ్ల తెరాస పాలనలో ప్రతి ఒక్కరికీ ఏడుపే మిగిలింది. అమరుల త్యాగాలకు విలువ లేకుండా విధ్వంస పాలన సాగిస్తున్న గులాబీ చీడను తెలంగాణ నుంచి తరిమి కొట్టాలి. రైతు ఆత్మహత్యలు లేని, యువతకు ఉపాధి కల్పించి సకల జనుల జీవితాల్లో వెలుగులు నింపే తెలంగాణ.. కాంగ్రెస్ పార్టీ స్వప్నం. ఇందు కోసం పార్టీ విశ్రమించకుండా శ్రమిస్తుంది’’ అని రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు.