నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ..

తెలంగాణా రాష్ట్ర లో మరో 14వందల 33 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీలు భర్తీకి ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటివరకు 35వేల 220 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. త్వరలో ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.ఇటీవల అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ 80వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రూప్-1 పోస్టులతో పాటు పోలీస్​, రవాణా, అటవీ, ఎక్సైజ్ వంటి వివిధ శాఖల్లో 33,787 పోస్టులకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్-1, పోలీస్‌ నియామకాల దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ క్రమంలోనే తాజాగా పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో 1,433 ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆయా పోస్టులను భర్తీ చేయనుండగా.. త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.