హ్యాట్సాఫ్ సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆంధ్రా లో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు..

విజయవాడ:
R9TELUGUNEWS.COM.
ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హ్యాట్సాఫ్ సీఎం కేసీఆర్ అంటూ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు..
ఆంధ్రాలో బెనిఫిట్ షోలు, రద్దు చేయడంతో ఫ్యాన్స్ లో కొంత ఆగ్రహం వ్యక్తమైంది.. తెలంగాణలో భీమ్లా నాయక్ సినిమా నాయక్ సినిమా బెనిఫిట్ లు అనుమతించడం ఆంధ్ర నుండి తెలంగాణకు సైతం పవర్ స్టార్ ఫ్యాన్స్ వచ్చి బెనిఫిట్ షోలు చూసి ఆంధ్రాలో హల్చల్ చేయడం జరిగినట్లుగా సమాచారం…. దీంతో హర్షం వ్యక్తం చేస్తూ హాట్సాఫ్ సీఎం కేసీఆర్ అంటూ భారీ కటౌట్ లో పెట్టారు.. భీమ్లానాయక్‌ సినిమా విడుదలను పురస్కరించుకుని టికెట్ల ధరలు, ఇతర అంశాలపై తెలంగాణ ప్రభుత్వ తీరును మెచ్చుకుంటూ విజయవాడలో కృష్ణలంకకు చెందిన పవన్‌కల్యాణ్‌ అభిమానులు ‘హ్యాట్సాఫ్‌ సీఎం సార్‌’ అంటూ కేసీఆర్‌, కేటీఆర్‌, తలసాని శ్రీనివాసయాదవ్‌ ఫొటోలు ఉన్న భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది.