ట్రాఫిక్‌ పోలీసులు గుడ్‌న్యూస్‌ చెప్పారు..చలాన్లపై భారీ రాయితీ ..

ట్రాఫిక్‌ పోలీసులు గుడ్‌న్యూస్‌ చెప్పారు.. పేరుకుపోయిన ఈ-చలాన్లు క్లియర్స్‌ కోసం భారీ రాయితీలు ప్రకటించారు..
ద్విచక్ర వాహనదారులు, ఆటోవాలాలు పెండింగ్‌లో ఉన్న జరిమానాల్లో 25 శాతం చెల్లించి, 75 శాతం రాయితీ పొందవచ్చు. తోపుడు బండ్లపై ఉన్న చలాన్ల మొత్తంలో 20 శాతం చెల్లిస్తే సరిపోతుంది. మిగతా 80 శాతం రాయితీ. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు 30 శాతం చెల్లించవచ్చు. మిగతా 70 శాతం రాయితీ ఇస్తారు. కార్లు, తదితర వాహనదారులు 50 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ చలాన్లు ఎలా చెల్లించాలని అనే దానిపై క్లారిటీ ఇచ్చారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆన్ లైన్ ద్వారానే పెండింగ్ చనాన్లు చెల్లించాలని సూచించారు..ఈ చలాన్‌ సిస్టమ్‌ ద్వారా అన్ని పెండింగ్ చలాన్లు చెల్లించాలని సూచించారు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్… ఆన్‌లైన్‌లో అంటే ఫోన్ పే, పేటీఏం, గూగుల్ పే వంటి సేవలు ఉపయోగించుకోవచ్చన్న ఆయన.. లేదా మీ సేవ, ఈ సేవలో కూడా చెల్లించే అవకాశం ఉందన్నారు.. రేపటి నుంచి (మార్చి 1వ తేదీ) మార్చి 30వ తేదీ వరుకు ట్రాఫిక్ చలాన్లపై రాయితీ అమలు అవుతుందన్నారు. కరోనా కారణంగా అందరూ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు.. అందుకే ఈ రాయితీ కల్పించామన్నారు. ద్విచక్ర వాహనలకి 25 శాతం రాయితీ కల్పించాం.. నో మాస్క్ చలాన్లు కూడా రూ.1000 ఉంటే రూ.100 కడితే చాలన్నారు.. పేద వర్గాలకు వెసులబాటు ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని.. కేవలం హైదరాబాద్‌లోనే 500 కోట్ల రూపాయల విలువైన 1.75 లక్షల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. చెల్లింపులు అన్నీ ఆన్‌లైన్‌ ద్వారా చేసుకోవచ్చు అని తెలిపారు రంగనాథ్.. తెలంగాణ ఈ చలాన్ వెబ్ సైట్‌లో ప్రాసెస్ చేస్తుందని.. నెల రోజుల వేసులబాటులో చలాన్లు కట్టకపోతే తగిన చర్యలు తీసుకుంటామని.. దానికోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్టు తెలిపారు. మరోవైపు, ఆటోలపై నిబంధనలు విధించామని తెలిపారు జాయింట్‌ సీపీ రంగనాథ్.. హైదరాబాద్ సిటీలో పర్మీషన్ ఉన్నవి ఉంటే పరవాలేదు.. కానీ, బయట జిల్లాల నుంచి వచ్చే వాటిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆటోలో మీటర్ వేసే పరిస్థితి లేదని.. స్పెషల్‌ డ్రైవ్‌పై ఆటో యూనియన్లకు సమాచారం కూడా ఇచ్చినట్టు తెలిపారు.