ఉప రాష్ట్రపతి హైదరాబాద్ లో ప‌ర్య‌టించే ప్రాంతాల్లో పోలీసుల ట్రాఫిక్ ఆంక్ష‌లు…!

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైద‌రాబాద్ న‌గ‌రంలో రేపు(గురువారం) ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో వెంక‌య్య నాయుడు ప‌ర్య‌టించే ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. జూబ్లీహిల్స్ నుంచి శివ‌రాంప‌ల్లి వ‌ర‌కు ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని తెలిపారు. జూబ్లీహిల్స్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, NFCL,తాజ్‌కృష్ణ, మాసబ్‌ట్యాంక్‌, పీవీఎన్‌ఆర్‌ ఎక్‌ప్రెస్‌ మీదుగా శివరాంపల్లికి వెంక‌య్య నాయుడు చేరుకుంటారు. శివ‌రాంప‌ల్లిలో కార్య‌క్ర‌మం ముగిసిన తర్వాత.. ఉదయం 11:50 గంట‌ల‌కు అదే రూట్‌లో జూబ్లీహిల్స్‌ రోడ్డు నెం.29లోని ఆయన నివాసానికి చేరుకుంటారు.