హైదరాబాదు నుండి ఒకేసారి వేలలో వాహనాలు..చౌటుప్పల్ టౌన్ లో భారీ ట్రాఫిక్ జామ్..

హైదరాబాదు నుండి ఒకేసారి వేల వాహనాలు. చౌటుప్పల్ టౌన్ లో భారీ ట్రాఫిక్ జామ్..

సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో వాహనాలు బారులు తీరాయి. ప్రజలు పెద్దసంఖ్యలో హైదరాబాద్‌ నుంచి సొంతూర్ల బాట పట్టటడంతో సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో సంస్థాన్ నారాయణపురం క్రాస్ రోడ్డుని పోలీసులు మూసివేశారు. అటువైపు వెళ్లే వాహనాలు వలిగొండ రోడ్డు వద్ద యూటర్న్ తీసుకొని వెళ్లాల్సి పరిస్థితి ఏర్పడింది….

హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. నిన్న ఒక్కరోజే 62,000 వాహనాలు వెళ్లినట్టు జిఎంఆర్ అధికారులు తెలిపారు … జాతీయ రహదారిపై ప్రతి గంటకు 3000 వాహనాలు వెళ్తున్నాయి.. దీంతో హైదరాబాదు నుండి ఒకేసారి వేల వాహనాలు రావడంతో చౌటుప్పల్ టౌన్ లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది .. టౌన్ లో బస్టాండ్, తంగడపల్లి రోడ్డు, వలిగొండ రోడ్డు వద్ద మూడు క్రాసింగ్లు ఉండటం తో ప్రజలు రోడ్డు క్రాసింగ్ చేసే సమయంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ట్రాఫిక్ పోలీసులు, జిఎంఆర్ అధికారులు జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఏర్పడకుండా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్నారు..

వలిగొండ రోడ్డు నుంచి లక్కారం వరకు ట్రాఫిక్ జామ్

అండర్ పాస్ లేక వాహనదారులకు , స్థానిక ప్రజలకు తీవ్ర ఇక్కట్లు…