భారీ వర్షాలు.. నేటినుంచి 17 వరకు పలు రైళ్లు రద్దు..

రాష్ట్రంలో నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీగా వరదలు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో గురువారం నుంచి 17వ తేదీ పలు రైళ్లను దక్షిణమధ్య రైల్వే (SCR) రద్దుచేసింది. ఇందులో జంట నగరాల్లో నడిచే 34 ఎంఎంటీఎస్‌ రైళ్లు, 15 రైళ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ – ఉందాన‌గ‌ర్- సికింద్రాబాద్ ప్యాసింజ‌ర్ రైలు, సికింద్రాబాద్ – ఉందాన‌గ‌ర్ మెము ప్రత్యేక రైలు, హెచ్ఎస్ నాందేడ్ – మేడ్చల్ – హెచ్ఎస్ నాందేడ్ ప్యాసింజ‌ర్ రైలు, సికింద్రాబాద్ – మేడ్చల్ – సికింద్రాబాద్ మెము రైలు, సికింద్రాబాద్ – బొల్లారం – సికింద్రాబాద్ మెము రైళ్లను రద్దు చేశారు. ఇక కాకినాడ పోర్టు- విజయవాడ స్టేషన్ల మధ్యలో నడిచే రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.