సికింద్రాబాద్‌- గుంటూరు ఇంటర్‌సిటీలో పొగలు..

*స్టేషన్‌ ఘన్‌పూర్‌. సికింద్రాబాద్‌ నుంచి గుంటూరు వెళ్తున్న ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో పొగలు వచ్చాయి. రైలు జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ స్టేషన్‌ వద్దకు చేరుకోగానే పొగలు రావడాన్ని గమనించారు..

దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది స్టేషన్‌ ఘన్‌పూర్‌లో పది నిమిషాల పాటు రైలును నిలిపివేసి పూర్తిస్థాయిలో పరిశీలించారు. బ్రేక్‌ లైనర్లలో పొగలు వచ్చాయని.. ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించారు. అనంతరం రైలు యథావిధిగా గుంటూరుకు వెళ్లింది. పొగలు రావడంతో ఇంటర్‌సిటీలోని ప్రయాణికులు ఒకింత ఆందోళనకు గురయ్యారు..