రైలు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతి…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం శ్రీ‌కాకుళం జిల్లాలో రైలు ప్ర‌మాదం జ‌రిగింది. జి. సిగడాం మండలం బాతువా రైల్వే స్టేషన్ వద్ద సోమవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు చ‌నిపోయిన‌ట్టు ప్రాథ‌మిక స‌మాచారం. గౌహతి వైపు వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు సాంకేతిక లోపం వల్ల అక్కడ నిలిచిపోయింది. దీంతో కొందరు ప్రయాణికులు రైలు దిగి పట్టాలపై నిలబడి ఉండగా విశాఖ నుంచి వస్తున్న కోణార్క్ ఎక్సప్రెస్ రైలు పట్టాలపై ఉన్న వారిని ఢీ కొట్ట‌డంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…