భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదం…రైలు ప్రమాదం…ప్రమాదంలో కనీసం 233 మంది మరణం..!

భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదం…రైలు ప్రమాదాల పర్వం
ఒడిశా రైలు ప్రమాదం భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరమైనది.మహా విషాద ఘటనగా రైల్వే చరిత్రలో నిలిచింది.

ఒడిశా రైలు ప్రమాదం భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరమైనది.
మహా విషాద ఘటనగా రైల్వే చరిత్రలో నిలిచింది. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, గూడ్స్‌ రైలు ఢీకొని ఒడిశాలో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో కనీసం 233 మంది మరణించగా, మరో 900 మందికి పైగా గాయపడ్డారు.భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక జరిగిన రైలు ప్రమాదాలను పరిశీలిస్తే ఒడిశా రైలు ప్రమాదం పెద్దదని చెప్పవచ్చు…-2016వ సంవత్సరం నవంబర్ 20వతేదీన ఇండోర్-రాజేంద్ర నగర్ ఎక్స్‌ప్రెస్ యొక్క 14 కోచ్‌లు కాన్పూర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుఖ్రాయాన్ వద్ద పట్టాలు తప్పడంతో 152 మంది మరణించారు.ఈ ఘటనలో మరో 260 మంది గాయపడ్డారు.
-2002వ సంవత్సరం సెప్టెంబర్ 9వతేదీన రఫీగంజ్‌లోని ధవే నదిపై ఉన్న వంతెనపై హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో రఫీగంజ్ రైలు ధ్వంసమైంది…ప్రమాదంలో 140 మందికి పైగా మరణించారు. ఈ ఘటనకు ఉగ్రవాద విధ్వంసమే కారణమని ఆరోపించారు.
– 1964 వసంవత్సరం డిసెంబర్ 23వతేదీన రామేశ్వరం తుపాను కారణంగా పాంబన్-ధనుస్కోడి ప్యాసింజర్ రైలు కొట్టుకుపోవడంతో అందులో ఉన్న 126 మంది ప్రయాణికులు మరణించారు.
-2010వ సంవత్సరం మే 28వతేదీన జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ముంబైకి వెళ్లే రైలు జార్‌గ్రామ్ సమీపంలో పట్టాలు తప్పింది. ఆపై ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలు ఢీకొనడంతో 148 మంది ప్రయాణికులు మరణించారు…