బెంగాల్ లో ఢీ కొన్న రెండు రైళ్లు – పట్టాలు తప్పిన 12 బోగీలు, పలు రైళ్లు రద్దు..!

పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో రెండు గూడ్స్ రైళ్లు(Goods trains) ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో చాలా భోగీలు పట్టాలు తప్పాయి. నేడు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఓండా స్టేషన్‌(Onda Station)లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గూడ్స్ రైలు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఒక గూడ్స్ రైలును వెనుక నుంచి మరో గూడ్స్ రైలును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఒక ఇంజన్‌తో పాటు రెండు గూడ్స్ రైలులోని 12 భోగీలు(12 Bhogis) పట్టాలు తప్పినట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో అద్రా-ఖరగ్‌పూర్ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెండు రైళ్లు ఢీకొన్న సమయంలో భారీ శబ్దం వచ్చింది. దీంతో వెంటనే స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని రైల్వే అధికారులకు సమాచారం అందించారు

ఈ ప్రమాదానికి కారణమేంటి అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రెండు గూడ్స్ రైళ్లు ఖాళీగా ఉన్నాయి. ఈ ప్రమాదం కారణంగా ఆద్రా డివిజన్‌(Adra Division)లో పలు రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ట్రాక్ లను క్లియర్ చేయడానికి, రైళ్ల సేవలను పునరుద్దరించడానికి రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు