రేపటి నుంచి పలు రైళ్లు రద్దు..!

గుంటూరు-గుంతకల్లు రైలు మార్గంలో దొనకొండ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను(Trains) రైల్వే డబ్లింగ్ లైను పనుల కారణంగా ఈనెల 17వ తేదీ నుంచి తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 17329 నెంబర్ హుబ్లీ-విజయ వాడ(Vijaywada) రైలు ఈనెల 17 నుంచి 28వ తేదీ వరకు, 17330 నెంబరు గల విజయవాడ – హుబ్లీ రైలు ఈనెల 18 నుంచి 29 వరకు, 17253 నెంబరు గల గుంటూరు – సి కింద్రా బాద్ రైలు ఈనెల 18 నుంచి 29 వరకు, 17254 నెంబరు గల సికింద్రాబాద్ – గుంటూరు రైలు ఈనెల 18 నుంచి 29 వరకు, 17261 నెంబరు గల గుంటూరు -తిరుపతి రైలు ఈనెల 17 నుంచి 28 వరకు, 17262 నెంబరు గల తిరుపతి – గుంటూరు రైలు ఈనెల 18 నుంచి 29 వరకు, 17251 నెంబరుగల గుంటూరు – కాచిగూడ రైలు ఈనెల 17 నుంచి 28 వరకు, 17252 నెంబరు గల కాచిగూడ – గుంటూరు రైలు ఈనెల 18 నుంచి 29 వరకు 17228 నెంబరు గల గుంటూరు – డోన్రైలు మార్చి 31 వరకు, 17227 నెంబరు గల డోన్ – గుంటూరు రైలు ఏప్రిల్ 1వ తేదీ వరకు తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికా రులు వారి ప్రకటనలో తెలిపారు. రైలు ప్రయాణికులు ఈ అసౌకర్యాన్ని గుర్తించి సహకరించాలని కోరారు.