భక్తులతో వెళుతున్న టూరిస్ట్ బస్సులో మంటలు: 8 మంది మృతి. .!

హర్యానా లో శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నూహ్ ప్రాంతంలో ఓ టూరిస్ట్ బస్సుకు మంటలు చెలరేగాయి.

శుక్రవారం అర్థరాత్రి 1:30 నిమిషాల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పో యారు. మరో 24 మంది గాయపడ్డారు.

బస్సులో కనీసం 60 మంది ఉంటారని సమాచారం. వీరిలో చాలా మంది మతపరమైన యాత్రలో పాల్గొన్నట్టు తెలుస్తోంది.

ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు.. ఘటనాస్థలా నికి చేరుకొని క్షతగాత్రులు, మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.