నాగార్జునసాగ‌ర్ ఉపఎన్నిక‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవ‌రు?..

నాగార్జునసాగర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతితో అక్కడ ఉపఎన్నిక జరగనుంది. డిసెంబ‌ర్ ఒక‌టిన ఆయన అనారోగ్యంతో చ‌నిపోయారు. శాసనసభ స్థానం ఖాళీ అయ్యి నెలన్నర కావ‌డంతో ఏ క్షణమైనా షెడ్యూల్ విడుద‌లయ్యే ఛాన్స్ ఉంది. సీనియ‌ర్ నేత‌ జానారెడ్డిని అభ్యర్థిగా కాంగ్రెస్ ఖ‌రారు చేయ‌డంతో టీఆర్ఎస్ కూడా క్యాండిడేట్‌ ఎంపికపై దృష్టి పెట్టింది. దుబ్బాక‌లో ఓట‌మి, జీహెచ్ఎంసీలో అనుకున్న ఫ‌లితం రాక‌పోవ‌డంతో ఆచితూచి అడుగువేస్తోంది టీఆర్ఎస్. ఇప్పటికే రెండు మూడు స‌మావేశాలు జరిగినా అభ్యర్థిపై తుది నిర్ణయానికి రాలేదు. షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థిని ప్రకటించేందుకు టిఆర్ఎస్ కసరత్తు మొద‌లుపెట్టింది…

టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా.. తేరా చిన్నపరెడ్డి…?

త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా తెర చిన్నపరెడ్డి ఉన్నట్లు ఊహాగానాలు గుప్పుమంటున్నాయి…. ఇందుకు సంబంధించిన పార్టీ అధిష్టానం కూడా తెర చిన్నపరెడ్డి వైపు అధిష్టానం చూస్తున్నట్లు ఆ పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది….

ఉపఎన్నికలో జానారెడ్డిని ధీటుగా ఎదుర్కొనేందుకు శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరును కూడా టీఆర్‌ఎస్‌ హైకమాండ్‌ పరిశీలిస్తోందట. మంత్రి పదవి ఆశించి.. మండలి చైర్మన్‌ అయిన గుత్తా.. పార్టీ అధిష్ఠానం ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్టు సమాచారం. అయితే పోటీ చేయాల‌ని త‌న‌కు లేద‌ని, అలాంటి ప్రతిపాద‌న పార్టీ నుంచి రాలేద‌ని చెబుతున్నారు గుత్తా. ఒకవేళ గుత్తాను వద్దని అనుకుంటే.. మరోనేత తేరా చిన్నపరెడ్డి అభ్యర్థిత్వంపై కూడా పార్టీ చర్చిస్తోందట. చిన్నపరెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండటంతో ప్రస్తుతం ఆయన్ని కదపాలా వద్దా, చర్చ కూడా జరుగుతోంది. ఈ వారంలోనే అభ్యర్థిని ఫైనల్‌ చేయాల‌ని పార్టీ అధినేత కేసియార్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ను ఆదేశించిన‌ట్లు తెలుస్తోంది. ఆ మేరకు నల్లగొండ జిల్లా నేతలతో కేటీఆర్‌ మంతనాలు చేస్తున్నట్టు సమాచారం…

దాదాపు తేరా చిన్నపరెడ్డి పేరు ఖరారు అయినట్లు కూడా పార్టీ వర్గాలు బలంగా వినబడుతుంది………. కాంగ్రెస్ పార్టీ జానా రెడ్డి లాంటి బలమైన అభ్యర్థిని ఢీ కొట్టాలి అంటే అదే సామాజిక వర్గం చెందిన వ్యక్తికి ఇవ్వాలి అని ఆలోచనలో టిఆర్ఎస్ పార్టీ ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి…….. ఏది ఏమైనా ఉప ఎన్నికల వేల నాగార్జునసాగర్ లో త్రిముఖ పోటీ ఉండవచ్చును అనే ఊహాగానాలు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి….

కాంగ్రెస్ పార్టీ తరపున దాదాపు జానారెడ్డి పేరు ఖరారు అయినట్టు గా సమాచారం….

అధికార తెరాస పార్టీ తరఫున తేరా చిన్నపరెడ్డి పేరు ఎక్కువగా వినపడుతుంది…!

బిజేపీ పార్టీ లో ఇంకా అభ్యర్ధి కారారు కాకపోవడం…
తెరాస పార్టీ లో కాంగ్రెస పార్టిలో అసంతృప్తి ఉన్నవారిని లగే ప్రయత్నం లో ఉన్నట్లు వివిధ పార్టీలకు చెందిన నాయకులలో జోరుగా నడుస్తున్న ప్రచారం..