బైబై మోదీ, బైబై కేసీఆర్‌’’ అంటూ నాంపల్లిలోని గాంధీ భవన్‌ ఎదుట భారీ ఫ్లెక్సీ…

‘బీ అవేర్‌ ఆఫ్‌ మోదీ అండ్‌ కేసీఆర్‌.. బైబై మోదీ, బైబై కేసీఆర్‌’’ అంటూ నాంపల్లిలోని గాంధీ భవన్‌ ఎదుట భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే తెరాస, భాజపాల మధ్య ఫ్లెక్సీలపై వివాదం నడుస్తుండగా.. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం గాంధీ భవన్‌ వద్ద ఆ రెండు పార్టీలను విమర్శిస్తూ భారీ ప్రచారపత్రం ఏర్పాటైంది. కాంగ్రెస్‌ పార్టీ నాయకులే దీన్ని ఏర్పాటు చేసినట్లు శ్రేణులు చెబుతున్నాయి. ‘మోదీ, కేసీఆర్‌.. ఇద్దరు నాటకరాయుళ్లు.. తరిమికొట్టండి తెలంగాణ ప్రజలారా’, ‘ఈ ఇద్దరు వద్ధు. మీ పాలన వద్ధు. భవిష్యత్తుకు కాంగ్రెసే ముద్దు’ అంటూ ప్రచారపత్రంలో రాశారు.