KCR జాతీయ పార్టీ పేరు ఇదే..BRS (భారత్ రాష్ట్ర సమితి)…

*
TS: జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు వీలుగా TRS పేరును BRS (భారత్ రాష్ట్ర సమితి) గా మారుస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో పేరు మార్పుపై ప్రవేశపెట్టిన తీర్మానానికి 283 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. తెలుగువారితో పాటు హిందీలోనూ సులభంగా అర్థమవుతుందనే ఉద్దేశంతో భారత్ రాష్ట్ర సమితి పేరు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాజ‌కీయ చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్యాయం లిఖించబ‌డింది. భార‌త్ రాష్ట్ర స‌మితిగా సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. జాతీయ పార్టీగా మారుస్తూ ఏక‌గ్రీవ తీర్మానం చేశారు. 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్ర‌స్థానంలో మ‌రో మలుపు చోటు చేసుకుంది. ప‌లు రాష్ట్రాల నేత‌ల స‌మ‌క్షంలో కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావ తీర్మానానికి టీఆర్ఎస్ పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం ఆమోదించింది.