నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వల…ఆపరేషన్ ఆకర్ష్, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు….!.

నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వల… బెడిసికొట్టిన ఆపరేషన్ ఆకర్ష్, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు..

నలుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని బీజేపీ అధిష్టానం ఏర్పాటు చేసింది. వీరు భారీగా డబ్బులు ఎర వేసేందుకు ప్రయత్నిస్తూ హైదరాబాద్‌లో పోలీసులకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఇప్పటివరకు రూ.15 కోట్ల నగదును పోలీసులు సీజ్‌ చేశారు.
పట్టుబడిన వారిలో బీజేపీ నేతలు రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్‌ ఉన్నారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి అజీజ్ నగర్‌లోని పీవీఆర్ ఫామ్ హౌస్‌లో కోట్లలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాసేపట్లో దీనికి సంబంధించిన వివరాలను పోలీసులకు ప్రెస్‌మీట్లో కాసేపట్లో వివరించనున్నారు…
పోలీసులకు దొరికిపోయిన వారిలో దక్కన్‌ ప్రైడ్‌ హోటల్‌ యజమాని నందకుమార్ కూడా ఉన్నారు.

సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారని సమాచారం వచ్చిందన్నారు. రామచంద్రభారతి సంప్రదింపులు చేసినట్లు సమాచారం అందిందని సీపీ చెప్పారు. నందకుమార్, సింహయాజులులు రామచంద్రభారతిని హైదరాబాద్‌కు తీసుకొచ్చారని ఆయన వెల్లడించారు. పార్టీ ఫిరాయిస్తే పదవులు ఇస్తామని ప్రలోభ పెట్టినట్లుగా తెలుస్తోందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ సమాచారం ఇచ్చారని.. ఫామ్ హౌస్‌లో దాడులు చేశామని రవీంద్ర అన్నారు. రామచంద్రభారతి ఫరీదాబాద్ టెంపుల్‌లో వుంటారని స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. తిరుపతి నుంచి కూడా ఒక స్వామిజీ ఇక్కడికి వచ్చారని ఆయన అన్నారు. వీళ్లంతా కలిసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోందని సీపీ చెప్పారు. ఏమని ప్రలోభాలు పెట్టారనే దానిపై విచారణ జరుపుతున్నామని.. డబ్బులు, కాంట్రాక్ట్‌లు ఇస్తామని ప్రలోభ పెట్టినట్లుగా తెలుస్తోందని రవీంద్ర అన్నారు. ..