టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సమాచారంతోనే రైడ్‌ చేశాం : సీపీ స్టీఫెన్‌ రవీంద్ర*

*టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సమాచారంతోనే రైడ్‌ చేశాం : సీపీ స్టీఫెన్‌ రవీంద్ర*

తెలంగాణలో బీజేపీ ఆకర్ష్‌ బెడిసికొట్టింది. మునుగోడు ఎన్నికల్లో గెలిచే సత్తా లేని బీజేపీ.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించి బోల్తాపడింది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ వేసిన వలను సైబరాబాద్‌ పోలీసులు చేధించారు. ముగ్గురు బీజేపీ దూతలను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా సీపీ స్టీఫెన్‌ రవీంద్ర మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
తమను కొంతమంది ప్రలోభపెడుతున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సమాచారం అందించారని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. డబ్బు, కాంట్రాక్టులు, ఇతర పదవులు ఇస్తామని ఆశచూపారని పేర్కొన్నారు. వారిచ్చిన సమాచారంతో ఫామ్‌ హౌజ్‌పై రైడ్‌ చేశామన్నారు. ఈ రైడ్‌లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వీరిలో ఢిల్లీ నుంచి వచ్చిన పీఠాధిపతి రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారని పేర్కొన్నారు. రామచంద్రభారతితో పాటు ఫామ్‌హౌజ్‌లో తిరుపతి నుంచి వచ్చిన సింహయాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌ ఉన్నారని చెప్పారు. వీళ్లు ఏమని ప్రలోభ పెట్టారనే దానిపై విచారణ జరుపుతున్నామని.. వీరిపై లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటామని పేర్కొన్నారు..

*కాసేపట్లో ప్రగతి భవన్ కి ఎమ్మెల్యేలు*

◆ *ప్రగతి భవన్ కి చేరుకున్న కేటీఆర్, హరీష్ …భద్రత పెంచిన పోలీసులు*..

తమను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించినవారిని పట్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాసేపట్లో ప్రగతి భవనకు రానున్నారు. మొయినాబాద్ ఫాంహౌజ్లో తమకు ఎవరెవరు ఏం ఆఫర్ చేశారు, ఏం చేయాలని కోరారు అనే విషయాలు అక్కడ ప్రెస్మీట్లో వివరించే అవకాశముంది..