డ్రగ్స్‌ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసినా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌….

రేవంత్ రెడ్డి మేన‌ల్లుడు, బీజేపీ నేత కుమారుడు ఉన్నార‌న్నారు. రాష్ట్రాన్ని డ్ర‌గ్స్‌ లో ముంచుతోంది కేవ‌లం బీజేపీ, కాంగ్రెస్ నాయ‌కులేనని ఆరోపించారు...

హైదరాబాద్‌ రాడిసన్ బ్లూ హోటల్‌లో పోలీసులు భగ్నం చేసిన డ్రగ్స్ పార్టీ కేసుపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు…. జాతీయ పార్టీల నాయ‌కుల పిల్ల‌లే డ్ర‌గ్స్, గంజాయి మ‌త్తులో ఊగుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి మేన‌ల్లుడు, బీజేపీ నేత కుమారుడు ఉన్నార‌న్నారు. రాష్ట్రాన్ని డ్ర‌గ్స్‌ లో ముంచుతోంది కేవ‌లం బీజేపీ, కాంగ్రెస్ నాయ‌కులేనని ఆరోపించారు…ప‌బ్ నిర్వాహ‌కులు బీజేపీ నాయకురాలు ఉప్ప‌ల శార‌ద కుమారుడు అభిషేక్ అని తేలింద‌న్నారు బాల్క సుమన్‌. ఆమె 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ త‌ర‌ఫున పోటీ చేశార‌ని వివరించారు. అభిషేక్ బీజేపీ కండువా క‌ప్పుకొని ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా పాల్గొన్నారని అందుకు సంబంధించిన ఫోటోల‌ను విడుద‌ల చేశారు బాల్క సుమన్‌…ఎవరిని షూట్ చేయాలో… ఎవరిని ఉరి తీయాలో బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పాలని అన్నారు..చాలా మంది నాయకుల పిల్లలు ఆ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోందని… అన్నీ బయటకొచ్చాక మాట్లాడుతామని బాల్క సుమన్ అన్నారు. నిన్న పట్టుబడినవారిలో కొంతమందిని కస్టడీకి కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు ఇవాళ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని అన్నారు. పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. ఈ ఘటనతో కాంగ్రెస్, బీజేపీ నేతల నిజ స్వరూపం బయటపడిందని… ఇకనైనా ఆ రెండు పార్టీలు తమ వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు…