తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎంపీలు ఇవాళ లోక్‌స‌భ‌లో ఆందోళ‌న..

R9TELUGUNEWS.COM: తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎంపీలు ఇవాళ లోక్‌స‌భ‌లో ఆందోళ‌న చేప‌ట్టారు.

సాయంత్రం 4 గంట‌ల‌కు స‌భ ప్రారంభ‌మైన త‌ర్వాత‌.. వెల్‌లోకి దూసుకువెళ్లి నిర‌స‌న చేప‌ట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్ర‌ధాని మోదీ రెండు రోజుల క్రితం అసంబ‌ద్ధ వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీపై టీఆర్ఎస్ పార్టీ స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసు ఇచ్చింది. లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాతో పాటు లోక్‌స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌కు ఆ నోటీసులు అంద‌జేశారు. ఇవాళ టీఆర్ఎస్ ఎంపీలు ప్ల‌కార్డుల‌తో వెల్‌లో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. నామా నాగేశ్వ‌ర‌రావు నేతృత్వంలో లోక్‌స‌భ ఎంపీలు ఆందోళ‌న నిర్వ‌హించారు..