టీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రాజీనామా..!!

పార్టీలో అవమానాలు భరించలేకే రాజీనామా చేశానని వ్యాఖ్య..!

ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలకు అన్యాయం జరుగుతోందని విమర్శ..!!

పార్టీలో అవమానాలు భరించలేకే రాజీనామా చేశానని వ్యాఖ్యలు..

టీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రాజీనామా చేశారు. సీఎం కేసీఆర్ కు తన రాజీనామా లేఖ పంపించారు. టీఆర్ఎస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బూర.. తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర, భువనగిరి ఎంపీగా పని చేసిన అనుభవాలను లేఖలో పంచుకున్నారు…

టీఆర్ఎస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బూర.. తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర, భువనగిరి ఎంపీగా పని చేసిన అనుభవాలను లేఖలో పంచుకున్నారు. లేఖలో తన ఆవేదన పంచుకున్నారు బూర నర్సయ్య గౌడ్. టీఆర్ఎస్ పార్టీలో రాజకీయ బానిసత్వం చేస్తూ తాను ఇక పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. బలహీన వర్గాల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చే పరిస్థితి లేనప్పుడు తాను టీఆర్ఎస్ లో కొనసాగడం అర్ధరహితమని లేఖలో పేర్కొన్నారు బూర నర్సయ్య గౌడ్. 2019లో ఓటమి తర్వాత పార్టీలో చాలా అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలో తన అవసరం లేదని మీరు భావించారంటూ కేసీఆర్ ను ఉద్దేశించి లేఖలో ప్రస్తావించారు బూర. మునుగోడులో పార్టీ సమావేశాలకు తనను కావాలని పిలవలేదని, అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. పైరవీలు చేయనని తెలిసినా సీఎం తనను దూరం పెట్టారని బూర అన్నారు.
గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేసిన బూర నర్సయ్య గౌడ్ శనివారం సాయంత్రం బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు. శుక్రవారం ఉదమయే ఢిల్లీకి వెళ్లిన బూర నర్సయ్య గౌడ్.. పలువురు బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తో రాత్రి చర్చలు జరిపారు, బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరితే.. మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.