టీఆర్ఎస్‌ ఎంపీ గాయత్రి రవి కార్యాలయంపై ఈడీ, ఐటీ అధికారులు దాడులు…

టీఆర్ఎస్‌ ఎంపీ గాయత్రి రవికి ఈడీ, ఐటీ అధికారులు బిగ్‌ షాక్‌ ఇచ్చారు.

తాజాగా టీఆర్ఎస్‌ ఎంపీ గాయత్రి రవి కార్యాలయంపై ఈడీ, ఐటీ అధికారులు దాడులు చేశారు..

హైదరాబాద్‌ శ్రీనగర్ కాలనీలోని టీఆర్ఎస్‌ ఎంపీ గాయత్రి రవి ఆఫీసులో 11 గంటలుగా సోదాలు చేస్తున్నారు ఈడీ, ఐటీ అధికారులు. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్‌ కార్యాలయంలోనూ తనిఖీలు చేస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీలో కలవరం నెలకొంది.

కాగా, నిన్న తెలంగాణ రాష్ట్రంలో మైనింగ్ వ్యవహారాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను విభాగం (ఐటీ) కరీంనగర్ లోని ఆరు చోట్ల గ్రానైట్ సంస్థల కార్యాలయాల్లో తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. మంత్రి గంగుల కమలాకర్‌ ఇంట్లోనూ దాడులు చేశారు అధికారులు.