టీఆర్ఎస్ ఎంపీల ధర్నా….

*ఢిల్లీ*

▪️ టీఆర్ఎస్ ఎంపీల ధర్నా..
▪️ నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపు ,ధరల పెరుగుదల , ద్రవ్యోల్బణం , ఇతర ప్రజా నమన్యలపై తక్షణమే పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రత్యేక చర్చకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎఎస్ ఎంపీలు మరింత దూకుడు పెంచారు.

▪️బుధవారం టీఆర్ఎన్ పార్లమెంటరీ నేత కే.కేశవరావు , టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత , ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు నేతృత్వంలో పార్టీ ఎంపీలు విపక్ష ఎంపీలతో కలసి పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ధర్నా

▪️ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ మోదీ డౌన్ డౌన్ .. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ ఎంపీలు నినాదాలు చేశారు …ప్రజా సమస్యలను పార్లమెంట్లో చర్చించాలని పట్టుబట్టినందుకు ఎంపీలను సస్పెండ్ చేయడం అన్యాయం..వెంటనే రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్ ను ఎత్తివేయాలి.. న్యాయం జరిగేంతవరకు తమ పోరాటం కొనసాగుతుంది.

▪️ కేంద్ర ప్రభుత్వ మొండివైఖరిని నిరశిస్తూ నిరసన తెలుపుతున్న రాజ్యసభ సభ్యులను నస్పెండ్ చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రశ్నించినందుకు నస్పెండ్ చేస్తారా ?

▪️ ధర్నా కార్యక్రమంలో ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, కె. ఆర్. సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, దివకొండ దామోదర రావు, బండి పార్థసారధిరెడ్డి, మన్నే శ్రీనివాస రెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి, మలోత్ కవిత, బోర్లకుంట వెంకటేష్ నేతకాని, పోతుగంటి రాములు, పూసునూరి దయాకర్ తదితరుల తో పాటు విపక్షాల ఎంపీలు కూడా పాల్గొన్నారు.