టీఆర్ఎస్ కు షాక్: బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే…

కాంగ్రెస్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమమ్యగౌడ్‌ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర పెద్దలతో చర్చలు ముగియగా, ఏప్రిల్‌ 5లేదా 6న ఢిల్లీలో కాషాయం కండువా కప్పుకునేందుకు ముహూర్తం ఖరారైంది..!!!. ఉగాది పండుగ తర్వాత చేరేందుకు అవసరమైన ఏర్పాట్ల గురించి ఆయన ఇప్పటికే తన అనుచరులతో సమావేశమయ్యారు…
ఇలా అందరినీ కలిసి పార్టీలోకి రావాలంటూ కోరుతున్నారు… ఈ తరుణంలో.. అధికార టీఆర్ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగలడం ఖాయమైనట్టు తెలుస్తోంది.. టీఆర్ఎస్‌ పార్టీ నేత, ఆలేరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్‌.. బీజేపీలో చేరబోతున్నారు.. ఈ నెల 4 లేదా 5వ తేదీల్లో ఢిల్లీలో భిక్షమయ్యగౌడ్‌.. బీజేపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది…

కోదాడకు చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత,
రెడ్డి సామాజికవర్గానికి చెందిన విద్యాసంస్థల నిర్వాహకుడు, పార్టీ ఆవిర్భావం నుంచి కోదాడ నియోజకవర్గంలో తీవ్రంగా శ్రమించి టీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కక ఆపార్టీ రాజకీయాలకు దూరంగా ఉన్న నేతనే తదుపరి టార్గెట్‌ చేసినట్లు తెలిసింది..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ అనే భావించవచ్చు…
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ కీలక నేత కారు దిగి కాషాయ దళంలో చేరేందుకు మరికొందరు సిద్ధమైపోయారు అనే టాక్… ఆలేరు మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత భిక్షమయ్య గౌడ్ గులాబీ పార్టీ నుంచి కమలం తోటలోకి వెళ్లేందుకు దాదాపు రంగం సిద్ధమైంది…