టీఆర్‌ఎస్‌ని బీఆర్‌ఎస్‌గా మార్చడం ద్వారా కేసీఆర్ తొలి ఆదిపురుష్ అయ్యాడు… వర్మ.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన జాతీయ పార్టీపై రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. తాజాగా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ బీఆర్ఎస్ పార్టీపై తనదైన స్టైల్లో స్పందించారు. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ ఉండే రాంగోపాల్ వర్మ..బీఆర్ఎస్ పార్టీపై స్పందించారు. ‘టీఆర్‌ఎస్‌ని బీఆర్‌ఎస్‌గా మార్చడం ద్వారా కేసీఆర్ తొలి ఆదిపురుష్ అయ్యాడు. జాతీయ రాజకీయాలకు స్వాగతం’ అంటూ ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్ పై నెటిజన్లు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. కేసీఆర్‌ను వర్మ ఆదిపురుష్ అనడంతో ఇది పొగడ్త లేదా విమర్శ అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆదిపురుష్ పదమే వినిపిస్తోంది. ఆదిపురుష్ టీజర్ గురించి సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సినిమా టీజర్‌లో హిందూ దేవతలను దర్శకుడు ఓం రౌత్ తప్పుగా చూపించాడంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేవతల వస్త్రధారణ భిన్నంగా ఉందని, హనుమంతుడు లెదర్ వేసుకున్నట్లు చూపడం తప్పేనని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా మండిపడ్డారు. మరోవైపు ట్రోల్స్ వస్తున్నా ఆదిపురుష్ టీజర్ రికార్డులను క్రియేట్ చేస్తోంది. 24 గంటల్లో వంద మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన టీజర్‌గా రికార్డు సాధించింది..