ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పోస్టర్లకు పక్కనే బీజేపీ నేతలు పోస్టర్లు ఏర్పాటు….

తెలంగాణలో పండిన ప్రతి వడ్ల గింజనూ కేంద్రం కొనుగోలు చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ నిరసన దీక్ష చేపట్టింది. ఇది విజయవంతం అయిందని ప్రకటించింది. ‘రైతుల పక్షాన ప్రజా ప్రతినిధుల నిరసన దీక్ష’ పేరుతో అక్కడి తెలంగాణ భవన్‌లో చేపట్టిన ఈ దీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. దాదాపు 1,500 మంది ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ భారీ నిరసన దీక్షలో పాల్పంచుకున్నారు. ‘ఒకే దేశం-ఒకే ఆహారధాన్యాల సేకరణ విధానాన్ని’ అమలు చేయాలని టీఆర్‌ఎస్‌ ప్రధానంగా డిమాండ్‌ చేస్తోంది..నిరసన దీక్షా వేదిక తెలంగాణ భవన్ దగ్గర టీఆర్‌ఎస్‌ పోస్టర్లకు పక్కనే బీజేపీ నేతలు పోటీగా పలు పోస్టర్లు ఏర్పాటు చేయటం ఆసక్తి కలిగిస్తోంది. కేసీఆర్‌ దిగిపోవాలంటూ ఆ పోస్టర్ల ద్వారా బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పోస్టర్‌పై ” కేసీఆర్.. బియ్యం సేకరించడంలో మీ సమస్య ఏమిటి. ఈ ధర్నా ఎందుకు? రాజకీయాల కోసమా ? రైతుల కోసమా? చేతనైతే బియ్యాన్ని కొను….లేదంటే దిగిపో అని రాసి ఉంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్, దాని పరిసర ప్రాంతాల్లో రెండు పార్టీల పోస్టర్లు భారీగా వెలిశాయి…