మంత్రి మల్లారెడ్డి పాదయాత్రను అడ్డుకుని కాంగ్రెస్ శ్రేణుల నిరసన…..

జవహర్‌నగర్‌లోని గబ్బిలాలపేటలో మంత్రి మల్లారెడ్డి పాదయాత్రను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకుని నిరసన తెలిపారు. గబ్బిలాల్ పేట వద్ద కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని, తమ సమస్యలు తీరుస్తామని చెప్పి హామీలు నెరవేర్చలేదని కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను మల్లారెడ్డి అనుచరులు, టీఆర్ఎస్ శ్రేణులు అక్కడి నుంచి తోసేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగ్రప్రవేశం చేసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి జవహర్ నగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు..