తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు…

తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు మొద‌ల‌య్యాయి. మునుగోడు ఉప ఎన్నిక ఫ‌లితంలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయ‌మ‌వ‌డంతో.. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సంబురాలు చేసుకుంటున్నారు. ప‌టాకులు కాల్చుతూ ఆనందోత్స‌హాల్లో మునిగి తేలుతున్నారు. స్వీట్లు పంచుకుని ఎంజాయ్ చేస్తున్నారు. జై తెలంగాణ నినాదాలు, జై కేసీఆర్, జై బీఆర్ఎస్, జై భార‌త్ నినాదాల‌తో తెలంగాణ భ‌వ‌న్ ద‌ద్ద‌రిల్లిపోతోంది. గులాబీ జెండాలు రెప‌రెప‌లాడుతున్నాయి. బీఆర్ఎస్ బ్యాన‌ర్లు ఆక‌ర్షిస్తున్నాయి.

మునుగోడు ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి గెలుపు ఖాయ‌మైంది. మ‌రో నాలుగు రౌండ్లు మిగిలి ఉన్నాయి. 11 రౌండ్ల వ‌ర‌కు కూడా టీఆర్ఎస్ పార్టీనే లీడ్‌లో ఉంది. బీజేపీ అభ్య‌ర్థి రాజ‌గోపాల్ రెడ్డి రెండో స్థానంలో ఉండ‌గా, కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి ప‌రిమిత‌మైంది.

మునుగోడు స్థానికంగా కూడా అన్ని మండల కేంద్రాల్లో బాణసంచా పేల్చుకుంటూ సంబరాలు జరుపుకున్నారు..