తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల…

తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. మే 17 నుంచి 26 వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగనున్నాయి. మే 17 నుంచి 26 తేదీ వరకు పరీక్షలు జరుగుతుండగా.. 24న ఒకేషనల్‌ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, 25న ఒకేషనల్‌ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2, 26న ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు పరీక్షలు నిర్వహించనున్నారు విద్యాశాఖ అధికారులు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని.. సానిటైజర్, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది విద్యాశాఖ.

పరీక్షల షెడ్యూల్‌

1. మే 17న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (తెలుగు)
2. 18న సెకండ్‌ లాంగ్వేజ్‌ (హిందీ)
3. 19న ఇంగ్లీష్‌ పేపర్‌
4. 20న మ్యాథ్స్‌(గణితం )
5. 21న సైన్స్‌
6. 22న సోషల్