తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. ప్రైవేట్ కంపెనీలో 95 శాతం స్థానికులకే అవకాశం…!!

R9TELUGUNEWS.COM.: తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీల్లో ఉద్యోగ నియామకాలకు 95శాతం స్థానిక రిజర్వేషన్లు వర్తించనున్నాయి… రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం… ఉద్యోగ నియామకాల్లో జూనియర్‌ అసిస్టెంట్ మొదలు డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి వరకు 95శాతం స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయి. అదే తరహాలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీల్లోనూ స్థానిక రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు అన్ని శాఖల కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆయా సంస్థల్లో రిజర్వేషన్లు వర్తించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టి ఈనెల 23 వరకు సాధాన పరిపాలనశాఖకు నివేదిక పంపాలని సీఎస్‌ తెలిపారు.