సోమవారం 2022 – 23 వార్షిక బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది..గవర్నర్ స్పీచ్ లేకండానే ఈ ఏడాది తొలి సమావేశాలు…

ఆదివారం సాయంత్రం కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమావేశమై బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆమోదం తెలపనుంది. రూ.2.7 లక్షల కోట్లతో బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రవేశపెట్టే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి టి.హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, మండలిలో మంత్రి ప్రశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి ప్రవేశపెడుతారని పేర్కొన్నాయి. కాగా, గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పీచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండానే ఈ ఏడాది తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి….రాష్ట్ర కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సమావేశం కానుంది. 2022 – 23 వార్షిక బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆమోదం తెలపనుంది. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయబోయే కూటమిపైనా సమావేశంలో చర్చించనున్నట్టు తెలిసింది. ముంబై, ఢిల్లీ, రాంచీ పర్యటనల సందర్భంగా తాను ఈ ఫ్రంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు దిశగా జరిపిన చర్చలు, ఇతర అంశాలపై మంత్రుల నుంచి సీఎం ఫీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకునే అవకాశముంది…

రైతు రుణమాఫీ, ఇండ్లు కట్టుకునేందుకు,రైతుబంధు,కల్యాణలక్ష్మి,దళిత బంధుకు..బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించే అవకాశముంది…
ఎస్సీ కుటుంబాల సంఖ్యకు తగినంతగా ఫండ్స్ రిలీజ్ చేయలేదు. దీంతో ఈసారి రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల దాకా ప్రతిపాదించే అవకాశాలున్నాయి. ఆ తర్వాత రైతుబంధుకు రూ.14 వేల కోట్లు, ఆసరాకు రూ.15 వేల కోట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఆసరా పింఛన్ల అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గించే హామీకి ఈసారి నిధులు ఇచ్చే అవకాశాలున్నాయి. ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇచ్చే నిధులు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అప్పుల ద్వారా సమకూర్చుకోనున్నారు. రైతు రుణమాఫీ, ఇండ్లు కట్టుకునేందుకు అర్హులకు డబ్బులు ఇవ్వడం, కల్యాణలక్ష్మి వంటి వాటికి కూడా ఫండ్స్ ఎక్కువగానే ప్రతిపాదించినట్లు తెలిసింది…..గత ఏడాది రూ.2.32 లక్షల కోట్లతో పద్దును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈసారి రాష్ట్ర బడ్జెట్ రూ.2.7 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. రాష్ట్ర సొంత రాబడి ఈసారి భారీగా పెరుగుతుందని సర్కారు అంచనా వేసింది. మరోవైపు జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీపీ వృద్ధి రేటు పెరిగింది. దీంతో బడ్జెట్​భారీగానే ఉండే అవకాశముంది. వచ్చే ఏడాది కేంద్రం నుంచి దాదాపు రూ.36 వేల కోట్లు రానున్నాయి. కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటాతో పాటు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు, జీఎస్టీ పరిహారం, హెల్త్, అగ్రికల్చర్ గ్రాంట్లు ఇందులో ఉన్నాయి. వచ్చే ఏడాదికి తెలంగాణ జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీపీ రూ.11,54,860 కోట్లుగా అంచనాలు ఉన్నాయి. ఎఫ్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఎం పరిమితి ప్రకారం అందులో 3.5 శాతం అప్పు తీసుకునే అవకాశముంటుంది. వీటికి తోడు రాష్ట్ర ఆదాయం రూ.1.9 లక్షల కోట్లు దాటుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం, లిక్కర్ రేట్లతో ఆదాయం పెరగడం, భూముల అమ్మకంతో నాన్ టాక్స్ ఆదాయం ఎక్కువ వస్తుందని భావిస్తోంది. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి రూ.15,000 కోట్లు, లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రూ.20 వేల కోట్ల దాకా రాబడిని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కరోనా పరిస్థితులు ఏమీ లేకుంటే జీఎస్టీ వసూళ్లతోపాటు ఇతర ఆదాయాలు మస్తుగా వస్తాయని భావిస్తోంది. రాష్ట్ర రెవెన్యూ రాబడితో పాటు కేంద్రం నుంచి వచ్చే నిధులు, ద్రవ్యలోటు కలిపితే.. బడ్జెట్ రూ.2.7 లక్షల కోట్లు దాటుతుందనే అంచనాలున్నాయి..

గవర్నర్​ తమిళిసై తీవ్ర అసంతృప్తి వ్యక్తం .

గవర్నర్​ ప్రసంగం లేకుండానే బడ్జెట్​ సమావేశాలు ప్రారంభమవుతాయన్న రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్​ తమిళిసై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదట తన స్పీచ్​ఉంటుందని ప్రభుత్వం నోట్​ పంపిందని, ఆ తర్వాత దానిపై స్పష్టత కోరగా.. ప్రసంగం లేదని తెలిపిందన్నారు. ఇట్లా వ్యవహరించడం ఏం సంప్రదాయమని మండిపడ్డారు. అయినా తనకు ప్రజల సంక్షేమమే మొదటి ప్రాధాన్యమని, మరే విషయాలైనా, ఎలాంటి పరిస్థితులైనా ఆ తర్వాతేనని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా, ఫెడరల్​ స్ఫూర్తితోనే తాను ఫైనాన్స్ బిల్లుకు ఓకే చెప్పానని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజానికి ఫైనాన్స్​ బిల్లును రికమండ్​ చేసేందుకు తగిన సమయం తీసుకునే స్వేచ్ఛ తనకు ఉంటుందని, కానీ రాష్ట్ర ప్రజల సంక్షేమం, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఆలస్యం చేయకుండా ఓకే చెప్పానని వివరించారు. పాత సెషన్​నే కొనసాగిస్తున్నందున ఇది కొత్త సెషన్​ కాదని ప్రభుత్వం తెలిపిందని, అయితే సాధారణంగా ఎక్కువ కాలం గ్యాప్​ తర్వాత సభ ప్రారంభమైతే కొత్త సెషన్​గానే నిర్వహిస్తారని గవర్నర్​ గుర్తుచేశారు. ‘‘ప్రస్తుత సభ 5 నెలల గ్యాప్​ తర్వాత సమావేశమవుతున్నది.