తెలంగాణపై ఆమ్‌ ఆద్మీ పార్టీ చూపు…దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పాదయాత్ర రూట్‌మ్యాప్‌ సిద్ధం…!!!!

అప్ చిన్న చిన్న గా కొత్త రాష్ట్రాలపై అడుగులు చేస్తోంది…. పంజాబ్ లొ సంచలనం సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే.. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇప్పుడు తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ర్టంలో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఏప్రిల్‌ 14 అంబేద్కర్‌ జయంతి సందర్భంగా పాదయాత్రను ఆ పార్టీ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రారంభించనున్నారు. ఉచిత విద్య, వైద్యం అందించాలనే నినాదంతో పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నెల చివరివారంలో రాష్ర్ట నేతలు సమావేశమై పాదయాత్ర పేరు, ఎక్కడి నుంచి ప్రారంభించాలి వంటి అంశాలపై చర్చించి రూట్‌మ్యాప్‌ సిద్ధం చేయనున్నారు.