శాసన సభలో కొషన్ అవర్ రద్దు…..!

శాసన సభలో కొషన్ అవర్ రద్దు..

డైరెక్ట్ బడ్జెట్ డిస్కషన్…

బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. రేపు(బుధవారం) జరగబోయే చర్చలో క్వశ్చన్ అవర్ ను రద్దు చేశారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు బులెటిన్ రిలీజ్ చేశారు. రూల్ 38 ప్రకారం స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ విషయాన్ని సభ్యులు గమనించాలని కోరారు. దీంతో బడ్జెట్ పై నేరుగా చర్చ జరగనుంది. శాసన మండలి లో క్వశ్చన్ అవర్ కొనసాగనుంది. ఈ నెల 6న 2,90,396 కోట్లతో 2023,-24 బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.