తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ఆరో రోజు ప్రారంభం..

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ఆరో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు…ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం, ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల ఏర్పాటు, పోలీసు శాఖ ఆధునీక‌ర‌ణ‌, రాష్ట్రంలో విద్యుత్ రంగం, జీహెచ్ఎంసీ ప్రాంతంలో బ‌స్తీ ద‌వాఖానాలు, వ్య‌వ‌సాయ పంపుసెట్ల‌కు ప్రీపెయిడ్ మీట‌ర్లు, వివిధ సంస్థ‌ల నుండి రుణాలు, నిమ్మ‌కాయ‌ల నిల్వ కొర‌కు న‌కిరేక‌ల్ వ‌ద్ద శీత‌లీక‌ర‌ణ గిడ్డంగి వంటి అంశాల‌పై ప్ర‌శ్నోత్త‌రాలు కొన‌సాగుతున్నాయి…ఈ నెల 7న ప్రారంభ‌మైన బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. రేప‌టితో బ‌డ్జెట్ స‌మావేశాలు ముగియ‌నున్నాయి.