తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ సీఎం కేసీఆర్‌పై విమర్శలు..

వరి వేస్తే ఉరి అన్న ముఖ్యమంత్రితోనే ఇవాళ వడ్లు కొనిపిస్తున్నాం..

మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ సీఎం కేసీఆర్‌పై విమర్శల గుప్పించారు. మంగళవారం ఆయన ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ప్రతి ఏటా బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించి, ఖర్చు చేస్తామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికిందని ఆయన మండిపడ్డారు. 2017-18 నుండి 2021-22 వరకు ఎంబీసీ కార్పోరేషన్‌కు బడ్జెట్‌ కేటాయింపులకు ఖర్చుకు అసలు పొంతనే లేదని ఆయన వెల్లడించారు. ఎంబీసీలకు గడిచిన నాలుగు బడ్జెట్‌లలో 3 వేల కోట్లు కేటాయించినట్లు కాగితాల్లో కనిపిస్తున్నా ఫైనాన్స్‌ విభాగంలో ఆమోదం పొందింది రూ.350 కోట్లు కాగా కనీసం 10 కోట్లు కూడా ఖర్చు చేయలేదు (వాస్తవఖర్చు 7.10 కోట్లు) అని ఆయన తెలిపారు. ప్రస్తుతమున్న 36 కులాలు కాక మరో 15 కులాలవారు తమను ఎంబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేస్తున్నారన్నారు. .
ఓబీసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి స్పష్టమైన విధానంతో ముందుకు పోవాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మంగళవారం ఆర్టీసీ కల్యాణమండపంలో బీసీ విద్యావంతుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో బండి సంజయ్ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఓబీసీ వ్యక్తిని గుజరాత్‌కు ముఖ్యమంత్రిని చేస్తే అభివృద్ధి చేసి చూపించారు. నరేంద్రమోదీ గుజరాత్‌ను అభివృద్ధి చేయడంతో బీజేపీ దేశ ప్రధానిని చేసింది..

వరి వేస్తే ఉరి అన్న ముఖ్యమంత్రితోనే ఇవాళ వడ్లు కొనిపిస్తున్నాం…: బండి సంజయ్…

తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. వరి వేస్తే ఉరే అన్న ముఖ్యమంత్రితోనే వడ్లు కొనుగోలు చేయిస్తున్నామని, ఇది బీజేపీ ఘనత అని చెప్పుకొచ్చారు. సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఇదే వార్త అని, ఇది బీజేపీ సాధించిన విజయం అంటున్నారని పేర్కొన్నారు. ధాన్యం కొంటావా? లేక గద్దె దిగిపోతావా? అంటూ కేసీఆర్ కు తాము చేసిన హెచ్చరిక ఫలితాన్నిచ్చిందని వెల్లడించారు. నిన్న తాము చేపట్టిన దీక్ష కేసీఆర్ ను భయపెట్టిందని బండి సంజయ్ అన్నారు. సీఎం మోసం చేస్తున్నారన్న భావన రైతుల్లో కలుగుతున్నట్టు నిఘా వర్గాల నుంచి నివేదిక వచ్చిందని, దాంతో రైతులు తన కుర్చీ కింద పొగపెడతారని భయపడిన కేసీఆర్ ధాన్యం కొనుగోలు ప్రకటన చేశారని వివరించారు..