తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయం… బండి సంజయ్.

ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరిక...

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీల్లోని కీలక నేతలను ఆకర్షిస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా, టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్ కాషాయ కండువా కప్పుకున్నారు…
టీఆర్ఎస్ పాలన అంతానికి..ఇదే ఆఖరి పోరాటం. ప్రజలంతా బీజేపీకి అండగా ఉన్నారు. తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయం అన్నారు బండి సంజయ్…ఢిల్లీలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్, బండి సంజయ్ సమక్షంలో పార్టీలో చేరారు భిక్షమయ్య గౌడ్. ఈసందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ-అవినీతి-నియంత పాలన కొనసాగుతోంది. అరాచక పాలనపట్ల ప్రజలు విసిగిపోయారు. బీజేపీ చేపడుతున్న పోరాటానికి ప్రజలంతా అండగా నిలిచారు. టీఆర్ఎస్ పాలనను వ్యతిరేకించే ఇతర పార్టీల నేతలంతా కేసీఆర్ ను ఓడించాలనే ఏకైక లక్ష్యంతోపాటు బీజేపీ గెలుపు కోసం తమవంతు క్రుషి చేయాలనే సంకల్పంతో పార్టీలోకి వస్తున్నారు…