తెలంగాణ బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్ త‌న‌కు ఇష్ట‌మైన బాలీవుడ్ హీరో స‌ల్మాన్‌తో క‌లిసి డ్యాన్స్..!

తెలంగాణ బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్ త‌న‌కు ఇష్ట‌మైన బాలీవుడ్ హీరో స‌ల్మాన్‌తో క‌లిసి డ్యాన్స్ చేసింది…

త‌న క‌ల నిజ‌మైన‌ట్లు కూడా నిఖ‌త్ పేర్కొన్న‌ది. స‌ల్మాన్‌తో క‌లిసి డ్యాన్స్ చేసిన వీడియోను త‌న ట్విట్ట‌ర్‌లో ఆమె పోస్టు చేసింది. ల‌వ్ చిత్రంలోని సాతియా తూనే క్యా కియా అన్న పాట‌కు స‌ల్మాన్‌తో క‌లిసి నిఖ‌త్ స్టెప్పులేసింది. బాక్స‌ర్ నిఖ‌త్‌కు త‌గిన‌ట్లు స‌ల్మాన్ కూడా కొన్ని మూవ్స్ ఇచ్చాడు. తెలుగులో వెంక‌టేశ్ న‌టించిన ప్రేమ చిత్రాన్ని హిందీలో ల‌వ్ పేరుతో రిమేక్ చేశారు. ఆ ఫిల్మ్‌లో స‌ల్మాన్ న‌టించాడు. అయితే ఆ చిత్రంలోని పాట‌పైనే నిఖ‌త్ డ్యాన్స్ చేయ‌డం విశేషం.నిఖ‌త్ పోస్టు చేసిన వీడియోకు తెగ లైక్‌లు వ‌చ్చేస్తున్నాయి. ఇక కామెంట్లు కూడా బోల‌డ‌న్ని వ‌చ్చాయి. మేలో జ‌రిగిన వ‌ర‌ల్డ్ బాక్సింగ్ చాంపియ‌న్‌షిప్‌లో నిఖ‌త్ గోల్డ్ మెడ‌ల్ కొట్టిన విష‌యం తెలిసిందే. నిఖ‌త్ మెడ‌ల్ గెలిచిన స‌మ‌యంలో ఆమెను స‌ల్మాన్ ప్ర‌శంసించారు. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం కిసీ కి భాయ్ కిసీ కి జాన్ చిత్రంలో స‌ల్మాన్ న‌టిస్తున్నాడు…