తెలంగాణ రాష్ట్రంలో సిబిఐ విషయంలో కీలక నిర్ణయం.!!.

జీవో నెంబర్‌-51 ద్వారా టీఎస్‌ సర్కార్‌ ఉత్తర్వులు...

జీవో నెంబర్‌-51 ద్వారా టీఎస్‌ సర్కార్‌ ఉత్తర్వులు..

తెలంగాణ రాష్ట్రంలో సిబిఐ విషయంలో ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేలా గతంలో అనుమతి ఇచ్చింది సర్కార్. గతంలో సిబిఐకి ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకుంటూ దర్యాప్తు చేయాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.

రాష్ట్రంలో దర్యాప్తు కోసం గతంలో సీబీఐకి ఇచ్చిన దర్యాప్తు అనుమతిని ఉపసంహరించుకుంది. జీవో నెంబర్‌-51 ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది..
ఈ మేరకు ఆగస్టు 30న రాష్ట్ర ప్రభుత్వం జీఓ 51ని జారీచేసింది. సిబిఐ దర్యాప్తు చేయాలన్న బిజెపి పిటిషన్ నేపథ్యంలో 2 నెలల క్రితమే జీవో ఉపసంహరించినట్లు నిన్న ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది…