ఎలక్షన్ షెడ్యూల్ విడుదల…ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్..తెలంగాణలో 148 చెక్ పోస్టులు…

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్, మిజోరాం అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్‎ను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ విడుదల చేశారు..

*🔹 ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్*

_తెలంగాణలో ఇవాళ్టి నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి [Model Code Of Conduct] అమల్లోకి వచ్చిందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది._

_ఈ సమయంలో ప్రభుత్వం ఎలాంటి కొత్త పథకాల నిర్ణయం చేయకూడదని, ప్రకటనలు ఇవ్వకూడదని వెల్లడించింది._

_కాగా, రాష్ట్రంలో నవంబర్ 30 వ తేదీన పోలింగ్, డిసెంబర్ 3 వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది..

. తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఛత్తీస్‎గడ్‎లో మాత్రం రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిచనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మూడు రాష్ట్రాల సరిహద్దులను పంచుకుంటున్న తెలంగాణలో 148 చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో కలిపి 948 చెక్ పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. కాగా.. ఎలక్షన్ షెడ్యూల్ విడుదల కావడంతో ఈ రోజు నుంచే ఎలక్షన్ కోడ్ అమలులోకి వస్తుందని ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ పేర్కొన్నారు…ఐదు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటించింది. తెలంగాణలో అక్టోబర్‌ 3 నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించి, ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించింది. తెలంగాణలో 119 స్థానాలు, మధ్యప్రదేశ్ 230 స్థానాలు, మిజోరాం 40 స్థానాలు, ఛత్తీస్ గడ్ 90 స్థానాలు, రాజస్థాన్ 200 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఛత్తీస్ గడ్ లో మాత్రం రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మిగతా రాష్ట్రాల్లో మాత్రం ఒకే విడతలో ఎన్నికల కసరత్తు పూర్తిచేయనున్నారు.