తెలంగాణకు రూ.3 లక్షల కోట్లు నష్టం.. కేంద్రంపై సీఎం కేసీఆర్‌ ఫైర్‌..

విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌ రాష్ట్రమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. కొత్తగూడెంలో గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగించారు….సీఎం మాట్లాడుతూ..కొత్తగూడెం జిల్లాకు చాలా వచ్చాయని,ఇంకా చాలా వస్తాయని తెలిపారు. ఐక్య పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామన్నారు. 8 ఏళ్ల కిందటి తెలంగాణకు, ఇప్పటి తెలంగాణకు పోలికే లేదన్నారు…ఆనాడు రాష్ట్ర తలసరి ఆదాయం రూ.87 వేలు ఉంటే ఉప్పుడు తలసరి ఆదాయం రూ.2.78 లక్షలు ఉందని కేసీఆర్‌ తెలిపారు. ఆనాడు జీఎస్‌డీపీ రూ. 5లక్షల కోట్లు.. ఇప్పుడు మన జీఎస్‌డీపీ రూ.11.5 లక్షల కోట్లని పేర్కొన్నారు. కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని పూర్తి మానవీయ కోణంలో అమలు చేస్తున్నామన్నారు కేంద్ర అసమర్థ, దుర్మార్గ విధానాల వల్ల తెలంగాణ రూ.3లక్షల కోట్లు నష్టపోయిందని ఆరోపించారు.
అంతకుముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభించారు చేశారు. హెలికాప్టర్‌ ద్వారా మహబూబాబాద్‌ నుంచి కొత్తగూడెంకు వచ్చిన కేసీఆర్‌ జిల్లా నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. కలెక్టరేట్‌ ప్రాంగణానికి చేరుకోగా.. పోలీసుల నుంచి గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత కలెక్టరేట్‌ శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాంబర్‌లో కలెక్టర్‌ అనుదీప్‌ను కుర్చీలో కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు…