కేంద్రంపై కేసీఆర్ పోరు.. 20న రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు..

R9Telugunews.com ..రాష్ట్ర రైతాంగ స‌మ‌స్య‌ల‌ను పట్టించుకోని కేంద్రంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోసారి యుద్ధం ప్ర‌క‌టించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులేత్తిసిన నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేప‌ట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. కేంద్రం వైఖ‌రిని నిల‌దీస్తూ.. ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేప‌ట్టాల‌ని టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు కేసీఆర్ పిలుపునిచ్చారు. నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో భాగంగా బీజేపీ, కేంద్రం దిష్టి బొమ్మ‌ల‌ను ద‌గ్దం చేయాలన్నారు.
టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో కేంద్రం వైఖ‌రి ప‌ట్ల ఏం చేయాలో పార్టీ శ్రేణుల‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి కేంద్రం చేతులెత్త‌య‌డంతో.. ఈ విష‌యాన్ని రైతుల‌కు వివ‌రించాల‌ని చెప్పారు. వ‌రికి బ‌దులుగా ఇత‌ర పంట‌లు వేయాల‌ని సూచించారు. ఈ నెల 18న రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి కేంద్ర మంత్రిని క‌ల‌వ‌నున్న‌ట్లు కేసీఆర్ వెల్ల‌డించారు.