సీఎం కేసీఆర్‌తో సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి, రాకేశ్ తికాయ‌త్ భేటీ…రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారు : తికాయత్.

సీఎం కేసీఆర్‌తో బీజేపీ నాయ‌కులు, రాజ్య‌స‌భ స‌భ్యులు సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి, భార‌తీయ కిసాన్ యూనియ‌న్ నాయ‌కులు రాకేశ్ తికాయ‌త్ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తుతం దేశంలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌తో పాటు భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌పై చ‌ర్చించారు. కేసీఆర్‌తో క‌లిసి సుబ్ర‌మ‌ణియ‌న్ స్వామి, రాకేశ్ తికాయ‌త్ లంచ్ చేశారు.బీజేపీ, కాంగ్రెసేత‌ర పార్టీల‌తో జాతీయ స్థాయి కూట‌మిని ఏర్పాటు చేసేందుకు వివిధ పార్టీల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే ప‌నిలో ఉన్న‌ తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్‌రావు.. ఇటీవ‌లే మ‌హారాష్ట్ర‌లో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక‌రేతో పాటు ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్‌తో కేసీఆర్ స‌మావేశ‌మై జాతీయ రాజ‌కీయాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు…

రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారు : తికాయత్.

తెలంగాణాలో రైతాంగ, వ్యవసాయరంగ అనుకుల విధానాలు అమలవుతున్నాయని మెచ్చుకున్నారు కిసాన్ పోరాట నేత రాకేష్‌ తికాయత్. రైతు సంక్షేమం కోసం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఢిల్లీలో సీఎం కేసీఆర్ తో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. వ్యవసాయ రంగం అనేక సమస్యలు ఎదుర్కొటుందని.. రైతుల కోసం ప్రత్యామ్నాయ విధానాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. దీనిలో భాగంగానే తెలంగాణా సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యామని రాకేష్‌ తికాయత్‌ అన్నారు.