తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు.. సీఎం కేసీఆర్…

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి సంతోషంగా సాగాలనే సందేశాన్ని హోలీ రంగుల పండుగ ఇస్తుందన్నారు. ప్రకృతి మెచ్చే రంగులతో హోలీని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.