తెలంగాణ‌లో పెరుగుతున్న చ‌లి తీవ్రత..

*తెలంగాణ‌లో పెరుగుతున్న చ‌లి తీవ్రత…

తెలంగాణలో వాతావ‌రణ మార్పులు క‌నిపిస్తున్నాయి.. రాష్ట్రంలో చలి వాతావరణం కనిపిస్తోంది.

మొన్నటి వరకు పగటిపూట ఎండలతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ‌గా.. ప్ర‌స్తుతం వాతావరణంలో మార్పు కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తొంది. రుతు పవనాలు తిరుగుముఖం పట్టడంతో రాష్ట్రం వైపుగా చల్లని గాలులు వీస్తున్నాయి.

చాలా జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువకు చేరుకున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉదయాన్నే పొగమంచు కమ్మేస్తోంది…